: ప్రముఖ పాత్రికేయుడు ఎన్.రామచంద్రన్ కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు, కేరళ కౌముది పత్రిక సంపాదక సలహాదారు ఎన్.రామచంద్రన్(88) ఇక లేరు. తిరువనంతపురంలోని తన నివాసంలో గతరాత్రి ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఆరు దశాబ్దాల జర్నలిజంలో 'కేరళ కౌముది' కోసం పదునైన సంపాదకీయాలు, పలు రాజకీయ వ్యాఖ్యానాలు రాశారు. ఇప్పటికీ ఈ పత్రిక సమావేశాల్లో చాలా ఉత్సాహంగా ఆయన పాల్గొంటున్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మాజీ సభ్యుడైన చంద్రన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్ ఎస్ పీ) తోనూ సంబంధాలు నెరిపారు.