: యూపీ బీజేపీ నేత ఓంవీర్ హత్య
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత ఓంవీర్ (40) హత్యకు గురయ్యారు. ముజఫర్ నగర్ లోని మీర్ పూర్ ప్రాంతంలో బైక్ పై వచ్చిన ఇద్దరు గన్ మెన్లు కాల్చడంతో అక్కడికక్కడే ఆయన మరణించారు. వారం రోజుల కిందట ఇదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత విజయ్ పండిట్ ను కూడా గ్రేటర్ నోయిడాలో తుపాకీతో కాల్చి చంపారు. కొద్ది రోజుల తేడాతోనే బీజేపీ నేతల హత్యలు జరగడం గమనార్హం.