: విజయవాడ-గుంటూరులోనే రాజధాని: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ-గుంటూరు ప్రాంతం అనువైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలను కలిపితే హైదరాబాద్ స్థాయిలో నగరం రూపొందుతుందన్నారు. ఇక్కడ రైతుల నుంచి సేకరించిన భూమికి 60 శాతం మేర పరిహారం చెల్లించి, మిగిలిన 40 శాతం మేర వేరే ప్రాంతంలో వారికి భూమిని కేటాయిస్తామని. అందులో రోడ్లు, విద్యుత్ సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దానివల్ల ఆ భూమికి మంచి ధర వస్తుందని వివరించారు. అప్పటికీ భూ సేకరణ కష్టమైతే రాజధాని కోసం వేరే ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న 100 స్మార్ట్ సిటీల జాబితాలో వీటిని కూడా చేర్చాలని కోరతామని తెలిపారు.

  • Loading...

More Telugu News