: సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ పరిస్థితి విషమం?
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అభినందన చిత్రానికి దర్శకత్వం వహించి నంది అవార్డును సొంతం చేసుకున్న అశోక్ కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆయన కుమారుడు ఆకాశ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 60కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన అశోక్ కుమార్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 1980లో వచ్చిన నెంజతాయ్ కిల్లతే సినిమా ఆయనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.