: ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు: చంద్రబాబు


ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేయాలంటూ వారికి కర్తవ్య బోధన చేశారు. చంద్రబాబు ఈ రోజు మంత్రివర్గ సహచరులతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ... గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తు పెట్టుకుని, మరోసారి అధికారం కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఏ శాఖ తమకు ఇచ్చినా కష్టపడి పనిచేస్తామని మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబుకు చెప్పారు. ఈ సమావేశంలో కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీత, యనమల, మృణాళిని తదతరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News