: దిలీప్ కుమార్ జీవిత కథను ఆవిష్కరించిన అమితాబ్, అమీర్
ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమార్ జీవిత కథ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆవిష్కరించారు. నిన్న రాత్రి ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి దిలీప్ కుమార్ సతీమణి సైరాభాను సహా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దిలీప్ కుమార్ జీవిత కథ పుస్తకానికి సబ్ స్టాన్స్ అండ్ షాడో అనే పేరు పెట్టగా, దీన్ని ఉదయ్ తారా నాయర్ రచించారు. దిలీప్ కుమార్ కు తారా నాయర్ సన్నిహిత మిత్రురాలు. ఈ పుస్తకంలో దిలీప్ కుమార్ చిన్ననాటి జీవితం, నటుడిగా ఆయన పయనం, జీవితంలో ఎత్తు పల్లాలు అన్నింటినీ తారా నాయర్ పేర్కొన్నారు.