: దేశ రాజధానిలో తీవ్ర విద్యుత్ కోతలు... కాంగ్రెస్, ఏఏపీపై విమర్శలు


నిరంతర విద్యుత్ కోతలతో దేశ రాజధాని ఢిల్లీ అల్లాడుతోంది. నిన్న (సోమవారం) ఏకంగా ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఎండలు, ఇటు పవర్ కట్ తో వారి పరిస్థితి గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా పరిష్కారం మాత్రం దొరకలేదు. దీనిపై కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఈ రోజు పది గంటల సమయంలో ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహించారు. అయితే, విద్యుత్ కోతల సంక్షోభానికి గోయెల్ కాంగ్రెస్, ఏఏపీను విమర్శించారు.

ఇదిలా ఉంటే, ఢిల్లీ విద్యుత్ కోతలపై బీజేపీ, ఏఏపీలు ఒకటిపై మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షడు హర్షవర్ధన్ ఇంటి ఎదుట ఇతర పార్టీల కార్యకర్తలతో కలసి ఆప్ నేత మనీశ్ శిశోడియా నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతకుముందు హర్షవర్థన్ ను కలిసేందుకు ఆయన ఇంటి లోపలికి వెళ్లగా అప్పటికే ఆయన వెళ్లిపోయారు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న రోజుల్లో 24 గంటల పాటు పవర్ ఉందని శిశోడియా తెలిపారు.

  • Loading...

More Telugu News