: రామకృష్ణా స్టూడియోస్ లో బాలయ్య బర్త్ డే వేడుకలు


సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాదు నాచారంలోని రామకృష్ణా స్టూడియోస్ లో అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒక అభిమాని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం లక్ష రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి తన జన్మదిన వేడుకలకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల కోసం ఆయన ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News