: యూపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ వాయిదా
రాజ్యసభ పది నిమిషాల పాటు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలపై ఆ రాష్ట్ర బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్ద తీవ్ర నిరసన తెలిపారు. దాంతో, సభ కొనసాగేందుకు ఆటంకం కలగడంతో ఛైర్మన్ హామీద్ అన్సారీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.