: ప్రాజెక్టు అధికారులపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు కొట్టుకుపోవడంపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16లోగా వాస్తవిక పరిస్థితిపై నివేదికకు ఆదేశించింది. ఈ ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేటప్పుడు అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.