: సీమాంధ్రకు న్యాయం చేసే బాధ్యత కేంద్రానిదే: చంద్రబాబు


మంత్రులతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో పునరంకితం అవుతామని బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితులున్నాయని, ప్రజలు బాధల్లో ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసే బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీన విశాఖలో మంత్రివర్గ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు. రేపట్నుంచి వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచుతామని ఆయన అన్నారు. తెలంగాణకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తానని బాబు అన్నారు. ఆరంభం నుంచి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. భారీగా కసరత్తు చేస్తేనే ఏపీలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం వల్ల కేసీఆర్ కు వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News