: పుట్టిన రోజు కోసం కొత్త బట్టలు కూడా తీసుకెళ్లాడు, కానీ...!
"పుట్టిన రోజు కోసమని కొత్త బట్టలు కూడా తీసుకెళ్లాడు. ఈసారి పుట్టినరోజును విహార యాత్రలో స్నేహితుల మధ్య చేసుకుందామనుకున్నాడు. ఇప్పుడు మా బిడ్డ ఎలాగున్నాడో" అని ఆవేదనతో చెప్పారు మాచర్ల అఖిల్ తల్లిదండ్రులు. హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ లోని పి అండ్ టి కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ విహారయాత్రకు వెళ్లి హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.