: ఎంసెట్ ఫలితాల విడుదల
ఎంసెట్ 2014 పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 2,66,820 మంది ఎంసెట్ పరీక్ష రాశారని... వారిలో 1,88,831 మంది అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 70.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెడికల్ విభాగంలో 83.16 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. విద్యార్థుల సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) ద్వారా ర్యాంకులను వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.