: విద్యార్థుల గల్లంతు ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాదు విద్యార్థులు గల్లంతు అయిన ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందించింది. విద్యార్థులు గల్లంతు కావడం దురదృష్టకరమన్న యాజమాన్యం గల్లంతుపై వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చామని చెప్పింది. కళాశాల నుంచి ఐదుగురిని ఘటనా స్థలానికి పంపామని తెలిపింది. ఇప్పటివరకు ఐదు మృత దేహాలు వెలికితీశారని, మిగతా వారి గురించి గాలింపు చర్యలు జరుపుతున్నారని యాజమాన్యం చెప్పింది. ఈ విపత్కర పరిస్థితిలో తమకు అందరి సహకారం కావాలని అర్థించింది. పోలీస్, రెవెన్యూ తదితర ప్రభుత్వ విభాగాలతో పాటు మీడియా సహకరించాలని కోరింది.