: తుది తీర్పునకు లోబడే ప్రభుత్వ చర్యలు: సహకార ఎన్నికల పిటిషన్లపై హైకోర్టు
రాష్ట్రంలో కొన్ని చోట్ల సహకార ఎన్నికలు వాయిదా వేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు స్పందించిన న్యాయస్థానం, ఎన్నికలపై ప్రభుత్వం
తదుపరి తీసుకునే చర్యలన్నీ, చివరి తీర్పుకు లోబడే వుండాలని స్పష్టం
చేసింది. కాగా, పిటిషన్లపై వాదనలను వేర్వేరుగానే వింటామని న్యాయమూర్తి
తెలిపారు.