: విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడిన స్మృతి ఇరానీ


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాదు విద్యార్థులు గల్లంతైన ప్రమాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరా తీశారు. విజ్ఞాన జ్యోతి కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యార్థులతో ఆమె ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడామని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించామని ఆమె మీడియాకు చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News