: తెలంగాణ ఎక్సైజ్ మంత్రిగా పద్మారావు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ తొలి ఎక్సైజ్ మంత్రిగా పద్మారావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎక్సైజ్ పాలసీ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతేగాక కల్లు దుకాణాలు తెరవడంపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.