: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం... హైలైట్స్!
భారత ప్రధాని ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
* ఏకగ్రీవంగా ఎన్నికైన లోక్ సభ స్పీకర్ కు శుభాకాంక్షలు.
* 30 ఏళ్ల తర్వాత సింగిల్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అభినందనీయం.
* 125 కోట్ల ప్రజల నమ్మకాన్ని మా ప్రభుత్వం నిలబెడుతుంది. ప్రభుత్వ విజయంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తారు.
* బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం అరికడుతుంది.
* ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం ప్రభావవంతంగా లేనందున... దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది.
* ప్రతి నీటి బొట్టు విలువైనదే. నీటిని సక్రమంగా వినియోగించే వ్యవస్థపై మా ప్రభుత్వం దృష్టి సారించింది.
* ఇంత పెద్ద దేశంలో ప్రశాంతగా ఎన్నికలు జరగడం చాలా గొప్ప విషయం. ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నా.
* కుల, మత సరిహద్దులను చెరిపేసి, ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారు.
* దారిద్ర్యానికి, ఆకలికి మతం, కులం లేదు.
* ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.
* ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రధాన లక్ష్యం.
* గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలిని మెరుగు పరచడం ప్రభుత్వ లక్ష్యాలలో ఒకటి. పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా దీన్ని సాధిస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలి.
* దేశంలో పేదరికాన్ని పారద్రోలడం అతి పెద్ద సవాలు.
* అధిక సంఖ్యలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా... అద్భుత ఫలితాలను సాధిస్తాం.
* సాధారణ విద్య, నైపుణ్యాల మధ్య ఉన్న గీతను చెరిపేస్తాం.
* క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక పథకాన్ని చేపడతాం.
* మహిళలపై అత్యాచారాలను, హింసను ఉక్కు పాదంతో అణచివేస్తాం.
* యోగాకు మరింత ప్రాధాన్యత కల్పిస్తాం.
* ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేస్తాం.
* వివిధ రహదారులను అనుసంధానించి... మెరుగైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం.
* మైనార్టీలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తాం. 'మదర్సాల అభివృద్ధి పథకం' తీసుకు వస్తాం.
* బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత.
* ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం రాష్ట్రాల వారిగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
* పార్లమెంటులో మహిళల 33 శాతం రిజర్వేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత.
* అవినీతి నిరోధం కోసం లోక్ పాల్ వ్యవస్థ.
* అవినీతి రహిత, ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగిన ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం.
* విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మన దేశానికి రప్పిస్తాం.
* న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కేసులను త్వరగా ముగించేందుకు న్యాయ వ్యవస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను వెంటనే చేపడతాం.
* ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం.
* జాతీయ ఈ-గవర్నెన్స్ పథకాన్ని అమలు చేస్తాం.
* టూరిజంను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తాం.
* వాణిజ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానాలను సరళీకృతం చేస్తాం. ఉద్యోగాలను సృష్టించడానికి అవకాశం ఉన్న చోట విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాం.
* రైల్వే నెట్ వర్క్స్ అభివృద్ధి కోసం 'డైమండ్ క్వాడ్రిలేటరల్ నెట్ వర్క్' ఏర్పాటు చేస్తాం.
* విమానయాన అభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా తక్కువ స్థాయి ఎయిర్ పోర్టులను నిర్మిస్తాం.
* అంతర్జాతీయ స్థాయిలో ప్రజా ప్రయోజనకర న్యూక్లియర్ అగ్రిమెంట్లను చేసుకుంటాం.
* భారతీయ సంస్కృతిలో భాగమైన గంగానదిని పరిశుద్ధం చేస్తాం.
* ప్రజల జీవిత స్థాయిని పెంచేందుకు అవసరమైన సైన్స్, టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, అభివృద్ధి పరుస్తుంది.
* రైతులకు మద్దతు ధర కల్పిస్తాం.
* దేశ ప్రజల రక్షణ విషయంలో వెనకడుగు వేయం. దేశ సరిహద్దులను కాపాడుతాం. భారత భద్రతా దళాలను చూసి గర్విస్తున్నాం. భద్రతాదళాలను మరింత బలోపేతం చేస్తాం.
* ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతి సాధిస్తాం.
* ఐదు 'టీ'లపై (ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ) దృష్టి పెడతాం.
* ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు 60 నెలల్లో స్పష్టమైన మార్పును చూపెడతాం. అత్యాధునిక, అన్ని విధాలా అభివృద్ధి చెందిన భారత్ ను సాధిస్తాం.