: డెహ్రాడూన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు జీవిత ఖైదు
డెహ్రాడూన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన పదిహేడు మంది పోలీసులకు ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జీవిత శిక్ష విధించింది. అంతేగాక రూ.20 వేల జరిమానా కూడా విధించింది. కొన్ని రోజుల కిందటే ఈ కేసులో వీరందరినీ కోర్టు దోషులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 22 ఏళ్ల రణబీర్ అనే ఎంబీఎ విద్యార్థిని 2009లో పదిహేడు మంది పోలీసులు కాల్చి చంపారు. అనంతరం వారందరిపై తీవ్ర ఆరోపణలు రావడం, సీబీఐ దర్యాప్తులో వారందరూ నిందితులుగా రుజువయ్యేందుకు సాక్ష్యాలు కూడా లభించడంతో న్యాయస్థానం ఈరోజు శిక్ష విధించింది.