: నీటిలో కొట్టుకుపోయిన విజ్ఞాన్ జ్యోతి విద్యార్థుల వివరాలు
బియాస్ నదిలో గల్లంతైన హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల్లో రిషితారెడ్డి, రిదిమ, విజేత, రిత్విక్, ఉపేందర్, పరమేశ్వర్, తరుణ్, సాయిరాజ్, శివప్రకాశ్ వర్మ, విష్ణువర్ధన్, దేవాశిష్ బోస్, సందీప్, జగదీశ్, సాధిర్, అరవింద్, మాచర్ల అనిల్, మిట్టపల్లి అఖిల్, రాంబాబు, ఆశిష్, శ్రీహర్ష, కిరణ్‌కుమార్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. పర్యటనకు వెళ్లిన వారిలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు అధ్యాపకులు ఉన్నారని ఆయన వివరించారు.