: రైతు రుణమాఫీపై కమిటీ వేస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో కూడిన కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పారు. కమిటీ సూచనలను బట్టి... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీని అమలు చేస్తామని తెలిపారు.