: బాబుకు శుభాకాంక్షలు... సత్సంబంధాలు కొనసాగాలి: కేసీఆర్
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన అభిలషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. తోటి తెలుగువారికి గోదావరి నీరు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కాకపోతే, ముంపు గ్రామాల గురించే ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా వ్యవహరిస్తామని చెప్పారు. ఇవాళ ప్రధాని మోడీని కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.