: పెరిగే సముద్ర మట్టం.. కోల్‌కతకు ప్రమాదం


పెరుగుతున్న సముద్ర మట్టాలతో మనదేశంలోని కోల్‌కత, బంగ్లాదేశ్‌లోని ఢాకా, చైనాలోని బీజింగ్‌ నగరాలకు ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌కె పచౌరీ ఈ విషయాన్ని వెల్లడిచారు.

సముద్ర మట్టం పెరగడం వల్ల వచ్చే వాతావరణ మార్పులు, తీరాల్లో వరదలు లాంటి సమస్యలు ఈ నగరాలకు ఎక్కువ కావచ్చునన్నారు. అదే జరిగితే గనుక.. జననష్టం, ఆస్థినష్టం కూడా తప్పదని అంటున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. ధ్రువాల్లో మంచు కరగడం వల్లనే ఈ సముద్ర మట్టాలు పెరగడం అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆయన చెబుతున్నారు.

  • Loading...

More Telugu News