: కానిస్టేబుల్ ను చెప్పుతో కొట్టిన మహిళ!
టీటీడీ ఉద్యోగులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం భక్తులను ఇబ్బందులపాలు చేయడానికే అలిపిరి చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్టుందని పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉదయం అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది తీరుపై ఓ భక్తురాలు అసహనం ప్రదర్శించింది. ఈ సందర్భంగా భక్తురాలిని నోటికొచ్చినట్టు దూషిస్తూ భద్రతా సిబ్బంది రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన భక్తురాలు ఓ కానిస్టేబుల్ ను చెప్పుతో కొట్టింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.