: ఆన్ లైన్ ఫ్రెండ్ తో రహస్య సంబంధం.. ఇంటర్నెట్ లో వీడియో


ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. మంచిగా మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఆమెతో శృంగారం చేస్తూ దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత అతడి బెదిరింపులకు ఆమె లొంగకపోయే సరికి ఆ వీడియోను ఇంటర్నెట్ కు ఎక్కించాడు. ఇంతటి నయవంచనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేశారు.

'డార్జిలింగ్ లోని భుటియాబస్తీకి చెందిన నిఖిల్ జింబియా, నార్త్ బెంగాల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెను జింబియా గతేడాది డిసెంబర్ లో ఓ పార్క్ కు తీసుకెళ్లి అక్కడ ఆమెతో కలిశాడు. దాన్ని వీడియో తీశాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించడమే కాకుండా తనకు 30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఆ రహస్య వీడియోని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు' అని పోలీసులు కేసు వివరాలు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News