: కర్నూలులో ఎయిమ్స్ ఆసుపత్రి?
ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కర్నూలులో ఏర్పాటు చేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గాంధీ, ఉస్మానియా, క్యాన్సర్ ఆసుపత్రి వంటి వైద్యాలయాలన్నీ హైదరాబాదులోనే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు కేవలం కేజీహెచ్ మాత్రమే చెప్పుకోదగ్గ ఆసుపత్రి. అక్కడ కూడా అరకొర సౌకర్యాలే!
దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ తరహా అసుపత్రి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాయలసీమ జిల్లాల కలెక్టర్లను భూసేకరణకు అదేశించింది. దీంతో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో 100 ఎకరాల భూమి, పాణ్యం మండలంలో మరో 100 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. దీంతో కర్నూలు జిల్లాలోనే ఎయిమ్స్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.