: విజయవాడ చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో తారక రామారావుకు నివాళి అర్పించిన అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. విమానాశ్రయం నుంచి ఆయన ఐజేఎం గెస్ట్ హౌస్ కు బయల్దేరారు. సాయంత్రం వరకు ఇక్కడ బసచేసి... అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ప్రాంగణానికి చేరుకుంటారు.