: బేగంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. అంతకు ముందు ఆయన ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి దివంగత తారక రామారావుకి నివాళి అర్పించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.