: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం
నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ రోజు రాత్రి 7.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా గతంలో యువగర్జన సభ నిర్వహించిన స్థలంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఈ ప్రమాణస్వీకార వేడుక జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మంది తరలివస్తారని భావిస్తున్నారు.