: 18వ సార్క్ సమావేశాలు పొకారాలో కాదు... ఖాట్మండులో


18వ సార్క్ సమావేశాలను నేపాల్ లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత పొకారాలో సార్క్ సమావేశాలు జరపాలని అనుకున్నారు. అయితే, మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని వేదికను ఖాట్మండుకు మార్చినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి మహేంద్ర పాండే తెలిపారు. సార్క్ కూటమిలో నేపాల్ తో పాటు భారత్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలు ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News