: ఐఎన్ఎస్ విరాట్ ను సందర్శించిన అరుణ్ జైట్లీ
యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సందర్శించారు. ముంబైలో నౌకాదళ సందర్శనలో భాగంగా ఆయన నేవీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆర్థిక, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అరుణ్‌జైట్లీ రక్షణ శాఖ విభాగాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు గస్తీనౌకలను కోస్ట్‌గార్డ్‌కు అంకితమిచ్చారు. గత ఆగష్టులో ప్రమాదానికి గురైన ఐఎన్ఎస్ సింధూ రక్షక్‌ను కూడా జైట్లీ సందర్శించారు. ఆ ప్రమాదంలో 18 మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. సింధురక్షక్ కు ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి.