: మైనర్ తో షోయబ్ అఖ్తర్ పెళ్లి


రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ లేటు వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన 39 ఏళ్ల షోయబ్ మైనర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని కంటే ఆమె 22 ఏళ్లు చిన్నది కావడం విశేషం. హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె 17 ఏళ్ల రుబాబ్ తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది.

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో వీరి వివాహం జరుగనుంది. 19, 20, 21 తేదీల్లో వివాహ కార్యక్రమాలు జరుగనున్నట్టు పాక్ పత్రిక వెల్లడించింది. రుబాబ్ కు క్రికెట్ అంటే పెద్ద ఆసక్తి లేకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News