: బాబు ప్రమాణ స్వీకారానికి పవన్ కల్యాణ్!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. అలాగే, పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అనంత కుమార్, మురళీ మనోహర్ జోషీ, పీయూష్ గోయెల్... బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజస్థాన్ సీఎం-వసుంధరా రాజె, గుజరాత్ సీఎం- ఆనంది బెన్, గోవా సీఎం-మనోహర్ పారికర్, ఛత్తీస్ ఘడ్ సీఎం-రమణ్ సింగ్, నాగాలాండ్ సీఎం-జిలియాంగ్ హాజరవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే.