: కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు
కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తొలి విడత మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశమివ్వాలని ఆయన భావిస్తున్నారు. సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారు. రేపు గుంటూరు వద్ద ప్రమాణస్వీకారం చేస్తున్న బాబు, మంత్రి వర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంలో తలమునకలై ఉన్నారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి బొజ్జల, సతీష్ రెడ్డి, వైశ్య సామాజిక వర్గం నుంచి సిద్ధా రాఘవరావు, కమ్మ సామాజిక వర్గం నుంచి కోడెల, పుల్లారావు, దేవినేని ఉమా, పరిటాల సునీత, యాదవ సామాజిక వర్గం నుంచి యనమల రామకృష్ణుడు, కాపు సామాజిక వర్గం నుంచి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, చినరాజప్ప, పతివాడ, గౌడ సామాజిక వర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి, గౌతు శివాజీ, ఎస్టీ కోటాలో ముడియం శ్రీనివాస్, ఎస్సీ కోటాలో పీతల సుజాత పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.