: అక్కడి మ్యాన్ హోల్ యముడి నోరుగా మారిపోయింది!


రోడ్లపై తెరచి ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్స్ మనకు తరచుగా దర్శనం ఇస్తూనే వుంటాయి. కానీ, బెంగళూరులోని నంజుండ స్వామి అనే చిత్రకారుడు మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. ప్రమాదకరంగా ఉన్న ఆ మ్యాన్ హోల్స్ ను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో మూత తెరచి ఉంచేసిన... ఓ మ్యాన్ హోల్ ను యముడి నోరుగా చిత్రీకరించాడు. ఎవరైనా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... ఆ మ్యాన్ హోల్ లో పడిన వారిని యముడు నేరుగా నరకానికి తీసుకెళ్లిపోతాడన్న భావన కలిగేటట్లు యముడి బొమ్మ వేశాడు. ఇప్పుడు నంజుండస్వామి ప్రయత్నాన్ని చూసి అక్కడ అందరూ అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News