: చంద్రబాబును కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, ఆయన కుమారుడు రవికిరణ్ వర్మ కలిశారు. కేవలం బాబును అభినందించేందుకే తాము వచ్చినట్లు వారు తెలిపారు. బాబును కలవడంలో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. అయితే, బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారిద్దరూ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.