: మోడీని పొగిడి... ఆపై వివరణ ఇచ్చుకుని


మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ ప్రధాని నరేంద్రమోడీని నోరారా ప్రశంసించి చిక్కుల్లో పడ్డారు. మోడీ అందరినీ కలుపుకుపోతున్నారని, 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్ కు అప్ గ్రేడ్ అయ్యారని, అభివృద్ధి, ప్రగతికి ఆధునిక అవతారంగా మారారని థరూర్ పొగిడారు. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకించడంతో థరూర్ కాస్త వివరణ ఇచ్చారు. కొన్ని అంశాలకు లోబడి మాత్రమే మోడీని పొగుడుతామని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నడచుకునేలా చేస్తామన్నారు. అదే సమయంలో ప్రధాని పనితీరును నిగ్గుతేలుస్తామని చెప్పారు. థరూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News