: 'దండుపాళ్యం' చిత్ర దర్శకుడితో శ్రీకాంత్ చిత్రం


అత్యంత క్రూరమైన సన్నివేశాలతో దండుపాళ్యం చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు శ్రీనివాసరాజుతో కుటుంబ కథా చిత్రాల హీరో శ్రీకాంత్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇది ఓ ప్రేమకథా చిత్రమని, కథ విన్న వెంటనే శ్రీకాంత్ నటించేందుకు అంగీకరించారని ఆయన ఆనందం వెలిబుచ్చారు. అంతేకాదు, ఇదే చిత్రాన్ని కన్నడలో ఉపేంద్రతో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు వివరించారు. దండుపాళ్యం ఇచ్చిన విజయంతో త్వరలోనే దండుపాళ్యం -2 చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News