: ఇంగ్లాండ్ ను రెండు సార్లు అవుట్ చేసే సత్తా భారత బౌలర్లలో లేదు: వెంగ్ సర్కార్


ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను రెండుసార్లు అవుట్ చేసే సత్తా భారత బౌలర్లలో లేదని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ అన్నారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, స్వదేశంలో ఇంగ్లాండ్ బలమైన జట్టని అన్నారు. భారత బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ను రెండుసార్లు అవుట్ చేసేంత నైపుణ్యం ఎవరిలోనూ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ధోనీ సేన విజయం సాధించాలని కాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. భారత జట్టు బౌలింగ్ భారాన్ని ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, వరుణ్ ఆరోన్, అశ్విన్ లు మోయనున్నారు.

  • Loading...

More Telugu News