: ఐటీలో హైదరాబాదును అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో హైదరాబాదును అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీకి పర్యాయపదంగా హైదరాబాదును మార్చుతామని ఆయన చెప్పారు. ఐఎస్ బీ, ట్రిపుల్ ఐటీలు హైదరాబాదులో ఉండటం గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాదును విప్లవాత్మకంగా అభివృద్ధిపరుస్తామని ఆయన వెల్లడించారు.