: ధర్మానను బర్తరఫ్ చేయండి : బొజ్జల
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును బర్తరఫ్ చేయాలంటూ టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి కేసులో చిక్కుకున్న ధర్మానను రక్షించేందుకే సీఎం సమయమంతా వెచ్చిస్తున్నారని ఆయన విమర్శించారు. అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోపిదేవికి ఓ న్యాయం, ధర్మానకు మరో న్యాయమా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వాన్ పిక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ధర్మాన బర్తరఫ్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని బొజ్జల విజ్ఞప్తి చేశారు.