: పీఓకే కాదు, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలవాలి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కాదు... ఇక నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాశ్మీర్ సమస్యను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మోడీ ప్రభుత్వం గుర్తించినట్లయింది. కాశ్మీరీ పండిట్ల పునరావాసానికి పెద్ద పీట వేయాలని కూడా మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లఢక్, జమ్మూ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
1990లో రాష్ట్రం విడిచి వెళ్లిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాలంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పండిట్లు వారి సొంత ప్రాంతాలకు రావాలంటే పరిస్థితులు అనుకూలించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఒక ప్రాంతాన్ని మాత్రమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలవడం వల్ల ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ అంటోంది.