: నకిలీ ఎన్ కౌంటర్ కేసులో దోషులుగా పోలీసులు
డెహ్రాడూన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన పదిహేడు మంది పోలీసులను ఢిల్లీలోని సీబీఐ కోర్టు దోషులుగా పేర్కొంది. 2009లో ఇరవై రెండేళ్ల రణబీర్ అనే ఎంబీఏ విద్యార్థిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనలో దాదాపు 17 మంది అతన్ని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో వారిపై విచారణ జరిపి ఈ రోజు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. పోలీసులందరూ అపహరణ, హత్య, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారని, హత్య చేసి సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారని సీబీఐ కోర్టు పేర్కొంది.