: అసోంలో ఎస్పీ మృతిపై ఆరా తీసిన కేంద్ర హోంశాఖ


అసోంలో తీవ్రవాదులతో జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారి (ఎస్పీ) మరణించిన ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో మిలిటెంట్లతో గురువారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో సీనియర్ పోలీస్ అధికారి మృతి చెందిన ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అసోం ప్రభుత్వాన్ని నివేదిక పంపించాలని కోరింది. అసోంలోని అటవీ ప్రాంతంలో కార్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్పీ నిత్యానంద్ గోస్వామితో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా మరణించినట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News