: చంద్రబాబు ప్రమాణ స్వీకారం రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు: ద.మ రైల్వే
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెల 8న విజయవాడ-గుంటూరు మధ్య ఆరు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు చెప్పింది. ఆ రోజు ఉదయం విజయవాడ నుంచి గుంటూరుకు 10 గంటలకు ఓ రైలు, 11.20కు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4.15కు, 5.30కు, తిరిగి రాత్రి 10.10కి గుంటూరు నుంచి విజయవాడకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నారు.