: 'ముష్టి'యా టర్నోవర్ 140 కోట్లు
తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించాలంటూ న్యాయవాది డీవీ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం హైదరాబాదులోనే 11 వేల మంది యాచకులు ఉన్నారని, భిక్షగాళ్ల మాఫియా ద్వారా ప్రతి ఏటా 140 కోట్ల టర్నోవర్ జరుగుతోందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. భిక్షగాళ్లను పునరావాస కేంద్రాల్లో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ లో ప్రతివాదులుగా రాష్ట్ర హోం సెక్రటరీ, మహిళా శిశు సంక్షేమ శాఖలను పేర్కొన్నారు.