: నా ప్రతిపాదనకు మోడీ ఓకే చెప్పారు: అక్షయ్ కుమార్


ప్రాథమిక విద్య దశలోనే కరాటే నేర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరానని బాలీవుడ్ స్టార్ హీరో, కరాటే ఎక్స్ పర్ట్ అక్షయ్ కుమార్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై దాడులు ఆగాలన్నా, గూండాయిజం నశించాలన్నా ప్రజలందరికీ యుద్ధ విద్య తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ కరాటే నేర్చుకోవాలని ఆయన సూచించారు. గత ఐదేళ్లుగా ఆయన దీని కోసం కృషి చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ ఢిల్లీ, ముంబైలలో పలు స్కూళ్లను దత్తత తీసుకుని కరాటే నేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోడీని కలిసి స్కూళ్లలో కరాటేను తప్పనిసరి చేయాలని సూచించారు. దానికి మోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మోడీ ఈ దిశగా చర్యలు తీసుకుంటారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News