: అల్లు శిరీష్ 'గౌరవం' నిలిపి వేయాలి: తమిళనాడులో డిమాండ్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తొలి సినిమా 'గౌరవం'. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాను తమిళనాట విడుదల చేయకూడదని ఓ వర్గం ఆందోళనకు సిద్దమైంది. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయంటూ గౌండర్ కమ్యూనిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పరువు హత్యలు ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన యామీ గౌతమ్ కథానాయికగా నటిస్తోంది.