: గడ్కరీ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ పై అభియోగాల నమోదు


బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. సెక్షన్ 499, సెక్షన్ 500 కింద ఈ అభియోగాలు నమోదు చేశారు. వీటి ప్రకారం కేజ్రీవాల్ కు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, కేసులో వ్యక్తిగతంగా హాజరుకు కోర్టు కేజ్రీకు మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది.

అంతకుముందు ఈ కేసు విచారణ నిమిత్తం ఈ రోజు ఉదయం ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్, గడ్కరీ హాజరయ్యారు. ఈ సమయంలో ఇద్దరూ సమాజంలో పేరున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు అయినందున వెనక్కి తగ్గి కేసును తొందరగా ముగించాలని జడ్జి వారిని కోరారు. అయితే, గడ్కరీపై చేసిన అవినీతి వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు కేజ్రీవాల్ తిరస్కరించారు.

  • Loading...

More Telugu News