: టీడీపీ అభివృద్ధి చేస్తే... కాంగ్రెస్ నాశనం చేసింది: చంద్రబాబు


తెలుగుజాతి గౌరవాన్ని కాపాడటానికే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు తదితర నిర్మాణాలన్నీ తెలుగుదేశం హయాంలోనే నిర్మితమయ్యాయని చెప్పారు. హైదరాబాద్ ఆదాయాన్ని పెంచింది టీడీపీనే అని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి టీటీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News